హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.) తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన రెండో విడత జనహిత పాదయాత్ర
వాయిదా పడింది. రేపు (28న) నకిరేకల్ నియోజక వర్గంలో జరగబోయే జనహిత పాదయాత్ర, 29న అచ్చంపేట, 30న జూబ్లీహిల్స్ లో జరగబోయే సభలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్టు పాదయాత్ర కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. జులై 31 నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర నిర్వహిస్తోంది. తొలివిడదలో రంగారెడ్డి జిల్లా పరిగిలో ఆగస్టు 4న ఈ పాదయాత్ర ప్రారంభమైంది. ఆ తర్వాత వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నెల 25న వర్ధన్నపేట నియోజకర్గం పరిధిలో ఈ పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షేలు, పార్టీ సీనియర్ నేతలు ఈ పాదయాత్రలో హాజరవుతున్నారు. ఈ క్రమంలో అనూహ్యంగా ఈ పాదయాత్ర వాయిదా పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..