దిల్లీ:27 ఆగస్టు (హి.స.)
భారత్-పాక్ ఘర్షణలను తానే ఆపానంటూ మరోసారి మీడియా ముఖంగా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి తానే స్వయంగా ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపించినట్లు చెప్పారాయన.
అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం వైట్‌హౌస్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. మీడియా బ్రీఫింగ్‌లో ఆయన ఈ కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన రోజు జరిగిన పరిణామాలంటూ స్పందించారు.
‘‘ఆ రోజు ఓ కఠినమైన వ్యక్తి.. భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. పాకిస్థాన్‌తో మీకు ఏం జరుగుతోందని ప్రశ్నించాను. ఆ తర్వాత పాక్‌తోనూ చర్చించా. అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పుఉందని భావించా. అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో ఘర్షణలను ఆపాలని కోరా. లేదంటే భారత్, పాక్‌తో వాణిజ్యఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించా. నేను విధించే భారీ టారిఫ్‌లతో మీ కళ్లు బైర్లు కమ్ముతాయని చెప్పా. నేను మరుసటిరోజు దాకా సమయం ఇస్తే.. ఐదు గంటల్లోనే అంతా సద్దుమణిగింది’’ అని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ