తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యూరియా కష్టాలు..
హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.) తెలంగాణలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ యూరియాకు కొరత ఉంది. దాంతో రైతులు ఎరువుల దుకాణాల దగ్గర యూరియా కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది. ఉదయాన్నే ఎరువుల దుకాణాలకు
యూరియా కష్టాలు


హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)

తెలంగాణలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ యూరియాకు కొరత ఉంది. దాంతో రైతులు ఎరువుల దుకాణాల దగ్గర యూరియా కోసం పడిగాపులు పడాల్సి వస్తోంది.

ఉదయాన్నే ఎరువుల దుకాణాలకు చేరుకుని చెప్పులు, ఆధార్ కార్డు లను క్యూలైన్లలో పెట్టి తమవంతు కోసం ఎదురుచూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే రైతులు అర్ధరాత్రి నుంచే ఎరువుల దుకాణాలకు చేరుకుంటున్నారు. ఒకవైపు భారీగా వర్షం పడుతున్నప్పటికీ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు..

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande