అమెరికా వీసా, గ్రీన్‌కార్డులపై కొత్త రూల్స్‌.. ట్రంప్‌ బిగ్‌ షాక్‌!
వాష్టింగన్‌:దిల్లీ:27 ఆగస్టు (హి.స.)వీసాలు, గ్రీన్ కార్డ్ విషయంలో అమెరికా మరో బాంబు పేల్చింది. అమెరికాలో హెచ్‌-1బీ(H-1B) వీసా, గ్రీన్ కార్డ్ రూల్స్ మొత్తం మార్చబోతున్నట్టు యూఎస్‌ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత గ్రీ
Donald Trump & Volodymyr Zelensky


వాష్టింగన్‌:దిల్లీ:27 ఆగస్టు (హి.స.)వీసాలు, గ్రీన్ కార్డ్ విషయంలో అమెరికా మరో బాంబు పేల్చింది. అమెరికాలో హెచ్‌-1బీ(H-1B) వీసా, గ్రీన్ కార్డ్ రూల్స్ మొత్తం మార్చబోతున్నట్టు యూఎస్‌ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత గ్రీన్ కార్డ్ వ్యవస్థ పెద్ద కుంభకోణంగా మారిపోయిందని ఆరోపించారు. దీంతో, ఇకపై అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఊహించిన షాక్‌ తగిలింది.

అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాలో హెచ్‌-1బీ(H-1B) వీసా, గ్రీన్ కార్డ్ అమలు విషయంలో కొత్త రూల్స్‌ తీసుకువస్తున్నాం. ప్రస్తుత లాటరీ పద్ధతిని రద్దు చేయబోతున్నాం. కేవలం నైపుణ్యం, వేతనం ఆధారంగా వీసాలు జారీ చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం. ప్రస్తుత H-1B వీసా వ్యవస్థ విదేశీ కార్మికులను అమెరికన్ ఉద్యోగ అవకాశాలను భర్తీ చేయడానికి అనుమతించే ఒక స్కాంగా మారిపోయింది. అమెరికన్ కార్మికులను నియమించడమే మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. గ్రీన్ కార్డ్‌ను సైతం మార్చబోతున్నాం. ప్రస్తుత గ్రీన్ కార్డ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఉన్న లాటరీ వ్యవస్థ ద్వారా అర్హత లేని, తక్కువ వేతనం పొందే వ్యక్తులకు కూడా గ్రీన్ కార్డ్ లభిస్తోందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. సగటు అమెరికన్ వార్షిక ఆదాయం $75,000 ఉండగా, గ్రీన్ కార్డ్ హోల్డర్ సగటు వార్షిక ఆదాయం $66,000 మాత్రమే ఉంది. ఇది తక్కువ సంపాదన ఉన్న వ్యక్తులను ఎంపిక చేయడమే అవుతుంది అంటూ లాజిక్‌ చెప్పారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, తాము ఈ కొత్త సంస్కరణలను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికాకు వెళ్లాలనుకునే వారిపై కొత్త విధానం ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మార్పులు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande