హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించేందుకు భక్తులు బుధవారం తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. ఈ సందర్భంగా మహా గణపతిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ గర్భిణీ క్యూలైన్లోనే ప్రసవించింది.
ఖైరతాబాద్ మహా గణనాథుడి తొలిపూజ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రసవించిన మహిళను రాజస్థాన్కు చెందిన రేష్మగా గుర్తించారు. ప్రసవం అనంతరం గణేశ్ ఉత్సవ నిర్వాహకులు.. మహిళను పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్