అమరావతి, 27 ఆగస్టు (హి.స)వాలీబాల్ ఆడటానికి పోల్స్ నిలబెడుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ ప్రసారమై యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఏడిద చరణ్ అనే యువకుడు మృతిచెందాడు. ఈ ఘటనపైఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్విచారం వ్యక్తం చేశారు. చరణ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పేర్కొన్నారు. ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకొని భరోసా ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారుపవన్ కల్యాణ్.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ