నటుడు విజయ్‌పై కేసు నమోదు
దిల్లీ:27 ఆగస్టు (హి.స.) ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్‌ (Actor Vijay)పై కేసు నమోదైంది. మదురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్‌కుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. నటుడిని కలిసేందుకు ప్రయత్ని
vijay


దిల్లీ:27 ఆగస్టు (హి.స.) ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్‌ (Actor Vijay)పై కేసు నమోదైంది. మదురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్‌కుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. నటుడిని కలిసేందుకు ప్రయత్నించగా.. బౌన్సర్లు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. దీంతో పోలీసులు విజయ్‌, ఆయన బౌన్సర్లపైనా కేసు (Case on Actor Vijay) నమోదు చేశారు.

ఆగస్టు 21న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల బయటికొచ్చింది. ఆ రోజున మదురైలో టీవీకే పార్టీ మహానాడు కార్యక్రమం జరిగింది. దానికి లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. విజయ్‌ వేదిక మధ్యలో ఉన్న ర్యాంప్‌పై నడుచుకుంటూ వారికి అభివాదం చేశారు. ఆ సమయంలో అతడిని చూసేందుకు కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ర్యాంప్‌ పైకి దూకి అతడిని కలిసేందుకు ప్రయత్నించారు. నటుడు విజయ్‌ బౌన్సర్లు వారిని అడ్డుకొని ర్యాంప్‌ పైనుంచి తోసేశారు.

ఈ క్రమంలోనే విజయ్‌ బౌన్సర్లు తనపై దాడి చేశారంటూ శరత్‌కుమార్‌ పెరంబలూర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్‌, అతడి బౌన్సర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

2

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande