అమల్లోకి 50% అమెరికా సుంకాల భారం 8
దిల్లీ:27 ఆగస్టు (హి.స.) వాషింగ్టన్, దిల్లీ: రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన అదనపు సుంకాలు నేటినుంచి అమల్లోకి వచ్చాయి (US Tariffs). ఆ దేశ కాలమానం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున
అమల్లోకి 50% అమెరికా సుంకాల భారం 8


దిల్లీ:27 ఆగస్టు (హి.స.)

వాషింగ్టన్, దిల్లీ: రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా విధించిన అదనపు సుంకాలు నేటినుంచి అమల్లోకి వచ్చాయి (US Tariffs). ఆ దేశ కాలమానం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 12.01 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలు) నుంచి అమలవుతున్నాయి. దీంతో గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం కలిపి భారత్‌ ఎగుమతులపై 50శాతం భారం పడుతోంది.

మన దేశం నుంచి ఎగుమతయ్యే 48 బిలియన్‌ డాలర్ల వాణిజ్యంపై ఈ సుంకాల ప్రభావం ఉంటుంది. సుంకాల అమలుపై అమెరికా (USA) హోంలాండ్‌ భద్రతా విభాగం సోమవారం ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం తెల్లవారుజామున 12.01 గంటల్లోగా ఓడల్లో లోడ్‌ చేసిన ఉత్పత్తులకు, రవాణాలో ఉన్నవాటికి అదనపు సుంకాలు వర్తించవు. వాటిని సెప్టెంబరు 17వ తేదీ తెల్లవారుజామున 12.01 గంటల్లోగా వినియోగిస్తున్నట్లుగా, గోదాముల నుంచి బయటకు వచ్చినట్లుగా పరిగణిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande