‘వైష్ణో దేవి’ చెంత మరో 28 మృతదేహాలు..
శ్రీనగర్‌:28 ఆగస్టు (హి.స.) జమ్ముకశ్మీర్‌లో వైష్ణో దేవి ఆలయం సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ శతాబ్దంలో అత్యధికంగా కురిసిన భారీ వర్షపాతం కారణంగా రాష్ట్రం అతలాకుతమయ్యింది. బీభత్సమైన వరదల కారణంగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితప
‘వైష్ణో దేవి’ చెంత మరో 28 మృతదేహాలు..


శ్రీనగర్‌:28 ఆగస్టు (హి.స.) జమ్ముకశ్మీర్‌లో వైష్ణో దేవి ఆలయం సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ శతాబ్దంలో అత్యధికంగా కురిసిన భారీ వర్షపాతం కారణంగా రాష్ట్రం అతలాకుతమయ్యింది. బీభత్సమైన వరదల కారణంగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించారు. కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ పూర్తిగా దెబ్బతింది.

ఆగస్టు 14 వైష్ణో దేవి మందిరానికి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల కింద పలువరు చిక్కుకున్నారు. తాజాగా ఈ ప్రాంతంనుంచి 28 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీసుకువచ్చారు. మరోవైపు రియాసి, దోడలో కొండచరియలు విరిగిపడటానికి తోడు, ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 38కి చేరింది. కొండచరియల ప్రమాదంలో అయినవారు మరణించిన బాధిత కుటుంబాలకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రూ.9 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande