అమరావతి, 28 ఆగస్టు (హి.స.) ఏపీ వ్యాప్తంగా 4,472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్ )లు ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రూ.1,129 కోట్లతో సొంత భవనాలను నిర్మించ తలపెట్టింది. ఏడాది వ్యవధిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు అవసరమయ్యే మొత్తం ఖర్చులో 80శాతం కేంద్రమే భరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మరో 1,379 నూతన భవనాలను రూ.753 కోట్లతో నిర్మించాల్సి ఉందన్నారు. వీటిని 16వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ