ముంబయి,28 ఆగస్టు (హి.స.) మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలిన ఘటనలో సుమారు 15 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక, విరార్‌లోని నారంగి ఫాటా దగ్గర ఉన్న రాము కాంపౌండ్‌లోని రమాబాయి అపార్ట్‌మెంట్ భవనం 4వ అంతస్తుకు చెందిన వెనుక భాగం ఒక్కసారిగా కూలింది.. ఆ శిథిలాలు పక్కనే ఉన్న ఒక చిన్న ఇళ్ల సముదాయంపై పడ్డాయి. దీంతో సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, వసాయి-విరార్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన ప్రదేశానికి చేరుకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ