వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష..
యాదాద్రి భువనగిరి., 28 ఆగస్టు (హి.స.) వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆయన నియోజకవర్గంలోని వినాయక నిమర్జన
భువనగిరి ఎమ్మెల్యే


యాదాద్రి భువనగిరి., 28 ఆగస్టు (హి.స.)

వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆయన నియోజకవర్గంలోని వినాయక నిమర్జన ఏర్పాట్లపై ఇరిగేషన్, మున్సిపల్, పంచాయితీరాజ్, పోలీస్, ఆర్ అండ్ బీ, ఎలక్ట్రిసిటీ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.నిమజ్జన ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించారు. నిమజ్జనాల కార్యక్రమానికి తీసుకోనున్న చర్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వినాయక నిమర్జనాల ఏర్పాట్లపై ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా చూడాలన్నారు. ఏవైన సమస్యలు ఉత్పన్నమయ్యే వెంటనే పరిష్కరించేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం భువనగిరి పెద్ద చెరువును అధికారులతో, ఉత్సవ సమితి సభ్యులతో పరిశీలించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande