హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)
తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం పరిధి లోని అఘాపురాలో తెలంగాణ ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలిక నమూనాలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సీఎం తరహాలో ఉన్న ఈ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు, భక్తులు ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా ఈ విగ్రహం ఏర్పాటుపై స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 'రేవంత్ ఏం దేవుడు కాదు' అని కామెంట్ చేశారు. వెంటనే ఆ మండపాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి లేఖ రాశారు. సీఎంపై గౌరవంతో దాన్ని ఏర్పాటు చేసినా ఆయన తమకు దేవుడు కాదని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీస్తాయని, మత విశ్వా సాలను గౌరవించాలని రాజాసింగ్ కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..