భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.) తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. చాలా గ్రామాల
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)

తెలంగాణలో భారీ వర్షాలు

కురుస్తున్నాయి. ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. చాలా గ్రామాల్లో వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు కారణంగా ప్రభావిత . ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి సహాయక చర్యలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో అధికారులు, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రులు శ్రీధరబాబు, సీతక్కతో పాటు తదితర అధికారులు భేటీ అయ్యారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande