హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)
ఆర్టీసీని కాపాడుకోవడం కోసం నిరంతర పోరాటాలకు సిద్ధం అవుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం ఆయన హైదరాబాద్లోని సీపీఐ పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. సజ్జనార్ ముఖ్యమంత్రినా..? మంత్రినా..? ఎండీ నా..? అని కూనంనేని సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్మికుల పట్ల ఆయన ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని, సజ్జనార్ పద్దతి మార్చుకోవాలని సూచించారు. సజ్జనార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉండవచ్చు, కానీ అట్లాంటి భయానక వాతావరణం ఆర్టీసీ కార్మికుల పట్ల సృష్టించడం సరైంది కాదని మండిపడ్డారు. కార్మికుల పట్ల సజ్జనార్ పద్ధతి మార్చుకోక పోతే ప్రత్యేక ఉద్యమాలు రూపొందించాల్సి వస్తుందని సజ్జనార్కు గుర్తు చేస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్