కలెక్టర్, ఎస్పీలపై బండి సంజయ్ ప్రశంసలు..
హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.) రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా ఇంటికి తరలించే వరకు విశేష సేవలు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే గ్రేట్ ఆఫీసర్స్ అని క
బండి సంజయ్


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా ఇంటికి తరలించే వరకు విశేష సేవలు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే గ్రేట్ ఆఫీసర్స్ అని కొనియాడి, వారికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా..

ప్రాజెక్ట్ వద్ద చిక్కుకుపోయిన వారిని హకీంపేటలోనే సైనిక హెలికాప్టర్లు చేరుకొని క్షేమంగా గమ్యం చేర్చారు.

ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన వారి పరిస్థితి పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎప్పటికప్పుడు ఆరా తీశారు. వారికి సహాయం అందించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం ఉదయమే ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ వారిని పరామర్శించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande