ఏపీలో .భారీగా వర్షాలు -మత్స్యకారులు సముద్రానికి వెళ్లకూడదని హెచ్చరికలు
అమరావతి, 28 ఆగస్టు (హి.స.) ఏపీలో ఈమధ్య భారీ వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. వర్షాలు ఎడతెరిపిలేకుండా కురవడం వల్ల అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు నీటితో నిండిపోయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింద
ఏపీలో  .భారీగా వర్షాలు -మత్స్యకారులు సముద్రానికి వెళ్లకూడదని హెచ్చరికలు


అమరావతి, 28 ఆగస్టు (హి.స.)

ఏపీలో ఈమధ్య భారీ వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. వర్షాలు ఎడతెరిపిలేకుండా కురవడం వల్ల అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు నీటితో నిండిపోయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉంది. మత్స్యకారులు సముద్రానికి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశాయి. అవసరం లేకుండా బయటకు రావొద్దని అధికారులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande