హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)
భారీ వర్షాల నేపథ్యంలో 44వ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారిపై (NH 44) భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వరద ఉధృతికి భిక్నూర్ వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో కామారెడ్డి నుంచి హైదారబాద్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. జంగంపల్లి నుంచి టెక్రియాల్ వరకు 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగపూర్ వెళ్లే వాహనాలు రాజీవ్ రహదారి మీదుగా కరీంనగర్ గుండా వెళ్లాలని అధికారులు సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్