మీలాద్ ఉన్ నబీ ర్యాలీ పోస్టుపోన్ చేసుకోవాలని ముస్లిం పెద్దలను కోరాం. సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.) గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం అని తెలిపారు. ఈ ఏడాది నిమజ్జనానికి 30 వేల మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిప
హైదరాబాద్ సిపి


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)

గణేష్ నిమజ్జనానికి సంబంధించి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం అని తెలిపారు. ఈ ఏడాది నిమజ్జనానికి 30 వేల మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 20 వేల మంది హైదరాబాద్ పోలీస్ లతో పాటు మరో 9000 మంది ఇతర జిల్లాల నుంచి బందో బస్తుకు వస్తారన్నారు.

మీలాద్ ఉన్ నబీ ర్యాలీ పోస్టుపోన్ చేసుకోవాలని ముస్లిం పెద్దలను కోరామని తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంతవరకు మొత్తం 12 మంది చనిపోయారని తెలిపారు. నిమజ్జనానికి తరలి వచ్చేప్పుడు భక్తులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇటీవల కాలంలో పండుగలకు జనాల తాకిడి పెరిగిందన్నారు. బోనాలకు విపరీతమైన భక్తులు వచ్చారు ఇపుడు వినాయక చవితికి కంటిన్యూ అవుతుందని తెలిపారు. గతేడాది జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు చేపడుతున్నామని వెల్లడించారు.

వారాంతాల్లో ఖైరతాబాద్ గణపతి దర్శనానికి భక్తులు తాకిడి పెరిగే అవకాశం ఉందన్నారు. వీఐపీల రాక నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. గణేష్

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande