హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.) హైదరాబాద్ క్రికెట్ అకాడమీ
(HCA) మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్రావు కు ఊరట లభించింది. HCA ఎన్నికల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగం వంటి అనేక ఆరోపణలు రావడంతో తెలంగాణ CID అతన్ని అరెస్టు చేసింది. 2025 జూలైలో అతన్ని మల్కాజ్గరి కోర్టు రిమాండ్కు పంపింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు చేయడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. అనంతరం దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ అధికారులు అతని జూన్ నెలలో అరెస్టు చేశారు. తాజాగా అతనికి షరతులతో కూడిన బేయిల్ను కోర్టు మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 2 లక్షల షూరిటీని ఇవ్వాలని ఈ రోజు కోర్టు ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..