హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్ నేతలు ఈ టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు, సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో వర్ష సూచన ఆధారంగా అనేక సూక్ష్మమైన అంశాలపై దృష్టి పెట్టేవాళ్ళమని చెప్పారు. NDRF, SDRF విభాగాలతో నిరంతర సమన్వయం చేసుకుంటూ పనిచేసేవాళ్ళమని గుర్తుచేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్