అమరావతి, 28 ఆగస్టు (హి.స.): విజయవాడలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు బెంగళూరు నుంచి విశాఖ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వీటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఈగల్ బృందం అదుపులోకి తీసుకుంది. అంతకుముందే విజయవాడ మహానాడు జంక్షన్ వద్ద అధికారులు నిఘా ఉంచారు. తనిఖీలు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ