మహబూబ్నగర్, 28 ఆగస్టు (హి.స.)
ఆందోళన చెందవద్దు.. అవసరమైన
మేరకు ఎరువులు వస్తాయి అని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. గురువారం భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో గత కొన్ని రోజులుగా ఎరువుల కోసం రైతులు పాట్లు పడుతూ, ఆందోళనలు చేస్తున్న క్రమంలో కలెక్టర్ ఎరువుల దుకాణాలను సందర్శించారు. అప్పటికే బారులు తీరి ఉన్న రైతులు ఎరువుల కోసం తాము పడుతున్న ఇబ్బందులను గురించి కలెక్టర్ కు వివరించారు. రైతులు చెప్పిన సమస్యలను ఓపికతో విన్న కలెక్టర్ అవసరమైన మేరకు తప్పనిసరిగా అందుబాటులోకి తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. అనంతరం ఆమె ఎరువుల విక్రయ దుకాణాలలో ఎరువుల నిలువలు, అమ్మకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు