వరదల ఎఫెక్ట్.. మెదక్ జిల్లాలో బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి దామోదర, ఎంపీ రఘునందన్ రావు
తెలంగాణ, మెదక్. 28 ఆగస్టు (హి.స.) రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెరువుల, కుంటలు అలుగులు పారుతున్నాయి. సిద్దిపేట-మెదక్ NH 765 డీ
మంత్రి దామోదర


తెలంగాణ, మెదక్. 28 ఆగస్టు (హి.స.)

రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెరువుల, కుంటలు అలుగులు పారుతున్నాయి. సిద్దిపేట-మెదక్ NH 765 డీజీ ప్రధాన రోడ్డుపై నందిగామ గ్రామ శివారులో ఉన్న బ్రిడ్జి వరదల ధాటికి ధ్వంసమైంది. ఈ బ్రిడ్జిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మెదక్ ఎంపీ రఘునందన్ రావు వేరువేరుగా పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ప్రజలు ఉండద్దని, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రమాదాన్ని అంచనా వేయాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న చెరువుల వద్దకు, కుంటల వద్దకు వెళ్లవద్దని.. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయంలో ఇంటి వద్దనే ఉండాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande