వర్షాల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.) వర్షాల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రెండు రోజులుగా మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయని, వర్షాలు వరదలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ
మంత్రి పొంగులేటి


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)

వర్షాల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రెండు రోజులుగా మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయని, వర్షాలు వరదలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్ష చేస్తున్నదన్నారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్ డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయన్నారు. ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన.. వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు మంత్రులు, అధికారుల నుంచి సమాచారం తీసుకుని ఆదేశాలు ఇస్తూనే ఉన్నారన్నారు. పోచారం డ్యామ్ ను ఓవర్ ప్లో అయిందని అదృష్టవాశాత్తు కాపాడుకోగలిగామన్నారు. రాష్ట్రావ్యాప్తంగా పలు చిన్నతరహా నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యంతో నిండిపయాయని వాటిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారని చెప్పారు. కామారెడ్డిలో ఇద్దరు చనిపోయారని ఇది దురదృష్టకరం అన్నారు. వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా పక్షాన అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande