ముజఫర్‌పూర్(బీహార్),28 ఆగస్టు (హి.స.) : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇండియా కూటమి తరపున బీహార్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిజెపి నేతృత్వంలోని కేంద్రం.. ఎన్నికల కమిషన్‌ను కీలుబొమ్మగా మార్చిందని విమర్శించారు. ఎన్నికలు న్యాయమైన రీతిలో జరిగితే, రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో బీహార్‌లో జరుగుతోన్న 'ఓటరు అధికార్ యాత్ర'లో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. మోదీ నేతృత్వంలోని కేంద్రం.. ఎన్నికల సంఘాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నడుపుతూ దానిని కీలుబొమ్మగా మార్చిందని ఆరోపించారు.
బీహార్ ప్రజలను ఓటర్ల జాబితా నుండి తొలగించడం సరైంది కాదని స్టాలిన్ తమిళంలో జనాన్ని ఉద్దేశించి చెప్పుకొచ్చారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ