మెదక్ జిల్లాలో పర్యటించిన హరీష్ రావు.. ముంపు గ్రామాల ప్రజలకు పరామర్శ..
తెలంగాణ, మెదక్. 28 ఆగస్టు (హి.స.) మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముంపు గ్రామాల్లో తిరుగుతూ త
హరీష్ రావు


తెలంగాణ, మెదక్. 28 ఆగస్టు (హి.స.)

మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముంపు గ్రామాల్లో తిరుగుతూ తామున్నామంటూ బాధితులకు భరోసానిస్తున్నారు. ప్రజలను పరామర్శిస్తున్నారు. బూరుగుపల్లి గ్రామంలో తెగిపోయిన రోడ్డు పరిశీలించిన ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడారు. అక్కడి నుంచి స్థానిక నాయకుల వాహనాలలో రాజాపేటకు బయలుదేరి వెళ్లారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న రాజాపేట, ధూప్ సింగ్ తండా వాసులను వారు పరామర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande