తెలంగాణ, మెదక్. 28 ఆగస్టు (హి.స.)
మెదక్ జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. దీంతో మంజీరా నదికి భారీ వరదలు పోటెత్తాయి. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏడుపాలయ వనదుర్గా భవాని మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని మూసివేసిన అధికారులు రాజ గోపురంలోనే వనదుర్గ అమ్మవారికి పూజలు చేస్తున్నారు. భారీ వరదల నేపథ్యంలో గత 14 రోజులుగా అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్నది. దీంతో భక్తుల రాకపై నిషేధం విధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు