హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)
కామారెడ్డిలో వర్ష బీభత్సం సృష్టిస్తున్న
సంగతి తెలిసిందే. నిన్న కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో పలు రైళ్లు సైతం రద్దయ్యాయి. ఇక తాజాగా బిక్నూర్ దగ్గర జాతీయ రహదారి సైతం కొట్టుకుపోయింది. దీంతో నాగపూర్ వెళ్లే వాహనాలు రాజీవ్ రహదారి కరీంనగర్ మీదుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..