జోగులాంబ జిల్లాలో కొనసాగుతున్న యూరియా కష్టాలు..
జోగులాంబ గద్వాల., 28 ఆగస్టు (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లాలో యూరియా కొరత వళ్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి రోజు యూరియా కోసం రైతులు తమ పొలాల పనులను వదులుకొని సహకార సంఘ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్ర
యూరియా


జోగులాంబ గద్వాల., 28 ఆగస్టు (హి.స.)

జోగులాంబ గద్వాల జిల్లాలో యూరియా కొరత వళ్ల

రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి రోజు యూరియా కోసం రైతులు తమ పొలాల పనులను వదులుకొని సహకార సంఘ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం సకాలంలో యూరియా అందించకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం ఆరు గంటలకే మహిళలు, వృద్ధులు సైతం యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడ్డారు. పంటకు కావలసిన మోతాదులో యూరియాను ప్రభుత్వం అందించకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కేవలం రైతుకు రెండు సంచుల యూరియా అందిస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande