న్యూఢిల్లీ,28 ,ఆగస్టు (హి.స.)తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బీహార్ పర్యటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. ఎన్నికల సంఘం.. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక బుధవారం రాహుల్‌గాంధీకి మద్దతిచ్చేందుకు స్టాలిన్ బీహార్ వెళ్లారు. ఒకే వాహనంపై తేజస్వి యాదవ్, స్టాలిన్, రాహుల్ గాంధీ కనిపించిన ఫొటో వైరల్ అయింది. ఈ ఫొటోపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బీహారీయులపై గతంలో స్టాలిన్ వ్యాఖ్యలను, కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను, డీఎంకే నేత దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ బీజేపీ నేత అన్నామలై సోషల్ మీడియాలో విమర్శించారు. గతంలో చేసిన వ్యాఖ్యలను మరోసారి బీహార్‌లో గుర్తు చేయగలరా? అంటూ ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ