వర్షాలు వరదలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష..
హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.) జిల్లాలో కురిసిన వర్షాల పట్ల అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం సంగారెడ్డి పట్టణ పరిధిలోని రేణిగుంట ఎర్రగుంట, మాసానుకుంట చెరువులు వరద నీటితో పొంగిపొర్లుతున్న వాటిని ప
సంగారెడ్డి కలెక్టర్


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)

జిల్లాలో కురిసిన వర్షాల పట్ల అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం సంగారెడ్డి పట్టణ పరిధిలోని రేణిగుంట ఎర్రగుంట, మాసానుకుంట చెరువులు వరద నీటితో పొంగిపొర్లుతున్న వాటిని పరిశీలించారు. అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. రేణిగుంట చెరువులో ఏర్పడిన గండిని పరిశీలించి తక్షణ మరమ్మత్తులు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. చెరువు కట్టలు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని, నీరు కిందకు పారేలా మార్గాలు కల్పించాలన్నారు.

వాగులు, చెరువులు, కుంటల వద్దకు ప్రజలు వెళ్లకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని, రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల మున్సిపల్ శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande