హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)
భారీ వర్షాలు, వరదల వేళ తెలంగాణ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కీలక పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో రాబోయే రోజుల్లో వర్షాలు మరింత తీవ్రంగా కురిసే అవకాశం ఉంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని పేర్కొన్నారు. ఈ వరదలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. 'తాను నిరంతరం రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో సమన్వయం చేస్తున్నాను. అలాగే మన రాష్ట్ర కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కూడా ఈ అంశంపై నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యం. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. తెలంగాణ బీజేపీ ఎల్లప్పుడూ మీతో ఉంది, మీ కోసం నిలుస్తుంది' అని రాంచందర్ రావు భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్