హైదరాబాదులో నేడు కూడా కురుస్తున్న వర్షం...
హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.) హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. గురువారం తెల్లవారుజాము నుంచి నగరంలోని ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, లక్షీకపూల్, మాసబ్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్లో వాన కురుస్తున్నది. బుధ
హైదరాబాద్ వర్షం


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.) హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. గురువారం తెల్లవారుజాము నుంచి నగరంలోని ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, లక్షీకపూల్, మాసబ్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్లో వాన కురుస్తున్నది. బుధవారం రాత్రి కూడా పలు ప్రాంతాల్లో వాన పడింది. హయత్నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, మలక్పేట సహా అక్కడక్కడా వర్షం కురిసింది. దీనితో జనం ఇబ్బందులు పడుతున్నారు..

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande