ముంబయి,28 ఆగస్టు (హి.స.) అమెరికా- భారత్‌ల మధ్య సుంకాల వివాదం నెలకొంది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై అగ్రరాజ్యం విధించిన అదనపు సుంకాలు (US Tariffs on India) నేటినుంచి అమల్లోకి వచ్చాయి. అయితే.. ఈ టారిఫ్‌ల సమస్య పరిష్కారానికి ఇరుదేశాల మధ్య సంప్రదింపులకు మార్గాలు తెరిచే ఉన్నాయని, ఈమేరకు ప్రయత్నాలు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత ఎగుమతుల్లో వైవిధ్యతను లెక్కలోకి తీసుకుంటే.. సుంకాల ప్రభావం ఊహిస్తున్నంత తీవ్రస్థాయిలో ఉండకపోవచ్చని చెప్పాయి. ఎగుమతిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇరుదేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాల్లో ఇదొక తాత్కాలిక దశ మాత్రమేనని పేర్కొన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ