ముంబయి,28 ఆగస్టు (హి.స.) యుద్ధ సమయంలో శత్రువు.. విద్యుత్ గ్రిడ్‌లు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్, ఆహార, నీటి సరఫరా, వైద్య పరిరక్షణ, రైల్వేస్టేషన్లు, రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగే అవకాశం ఉంది. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పహల్గాంలో అమాయక పౌరులను ఊచకోత కోసిన ఉగ్రవాదుల భరతం పట్టేందుకు మే నెలలో ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్.. పాక్‌లోని ముష్కర ముఠాల స్థావరాలు, వైమానిక శిబిరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా పొరుగు దేశం.. స్వల్పశ్రేణి ఫతా-1, ఫతా-2 క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లను భారత్‌పైకి భారీగా ప్రయోగించింది. వీటిని మన గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. అలాగే ఇరాన్‌తో జరిగిన పోరులో ఇజ్రాయెల్‌ను ఈ క్షిపణి రక్షణ కవచమే రక్షించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ