పట్నా/న్యూఢిల్లీ,28 ,ఆగస్టు (హి.స.)మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో ఉగ్ర కలకలం రేగింది. రాష్ట్రంలోకి ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో బిహార్ పోలీసు హెడ్ క్వార్టర్స్ గురువారం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ (High Alert In Bihar) జారీ చేసింది. ఉగ్రవాదుల ఫొటోలు, వివరాలను విడుదల చేసింది. వీరు నేపాల్ మీదుగా బిహార్ చేరుకున్నట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు.
ఉగ్రవాదులను హస్నైన్ అలీ (రావల్పిండి), ఆదిల్ హుస్సేన్ (ఉమర్‌కోట్), మహ్మద్ ఉస్మాన్ (బహవల్‌పూర్)గా గుర్తించారు. వీరంతా పాక్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైషే మహ్మద్ ముఠా సభ్యులని బిహార్ పోలీసులు వెల్లడించారు. ఆగస్టు రెండోవారంలో వీరు కాఠ్‌మాండూ చేరుకుని, గతవారం బిహార్ (Bihar)లోకి చొరబడ్డారని నిఘా వర్గాలు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ