‘అల్లూరి సీతారామరాజు’ పేరు ఫైనల్ చేసిన పవన్ కల్యాణ్
అమరావతి, 28 ఆగస్టు (హి.స.)జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ''సేనతో సేనాని’(Senato Senani) సభకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు(Alluri Seetarama Raju) ప్రాంగణంగా నామకరణం చేశారు. అంతేకాదు.. సభా స్
పవన్ కల్యాణ్


అమరావతి, 28 ఆగస్టు (హి.స.)జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు. 'సేనతో సేనాని’(Senato Senani) సభకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు(Alluri Seetarama Raju) ప్రాంగణంగా నామకరణం చేశారు. అంతేకాదు.. సభా స్థలి వద్ద ఏర్పాటు చేసిన ఐదు ప్రధాన ద్వారాలకు ఉత్తరాంధ్ర మహనీయుల పేర్లు ఫైనల్ చేశారు. జనసేన పార్టీ ఎల్లప్పుడు జాతీయ నాయకులను, మహనీయులను స్మరించుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మూడు రోజుల సమావేశాలతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నిండుతుందని అన్నారు. 28 నుంచి 30 వరకు జరిగే సమావేశాల్లో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొననున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీశ్రేణులు హాజరవుతారు. నేడు వైఎంసీఏ సమావేశ మందిరంలో జరిగే జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొని.. తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande