అమరావతి, 28 ఆగస్టు (హి.స.) అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు ) కురుస్తున్నాయి. విజయవాడ ) నగరంలో రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. కట్టెలేరు వంతెనపై వస్తున్న వరదనీటిని అధికారులు మళ్లిస్తున్నారు. నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, గన్నవరం, పామర్రు, పెనమలూరు, మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మరో వైపు ఏలూరు జిల్లా వ్యాప్తంగానూ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. కుక్కునూరు-దాచారం మధ్య గుండెటి వాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ