తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల, 28 ఆగస్టు (హి.స.)తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ సాధారణంగానే ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున భక్తుల రాక కొంత తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. అయి
తిరుమలతిరుమల


తిరుమల, 28 ఆగస్టు (హి.స.)తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ సాధారణంగానే ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున భక్తుల రాక కొంత తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. అయితే నిన్నటితో పోల్చుకుంటే భక్తుల సంఖ్య ఈరోజు ఎక్కువగానే ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలతో ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్న సమయంలో భక్తుల రద్దీ కొంత తగ్గుతుందని అధికారులు ముందుగానే అంచనా వేశారు.

ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీ వెంకటేశ్వర వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీ వెంకటేశ్వర వారి దర్శనం పది గంటల నుంచి పన్నెండు సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీ వెంకటేశ్వర వారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర వారిని 77,185 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,098 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

నిన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర వారి హుండీ ఆదాయం 3.06 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande