రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు.. ఉన్నతాధికారులతో స్పీకర్ కీలక సమీక్ష
హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.) రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉభయ సభలు సజావుగా జరిగేలా పోలీసు డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సభలు జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగ
అసెంబ్లీ స్పీకర్


హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.)

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఉభయ సభలు సజావుగా జరిగేలా పోలీసు డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సభలు జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకుని అడ్డుకోవాలని సూచించారు. తద్వారా సమావేశాలు సజావుగా జరుగుతాయని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం తన చాంబర్లో పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులతో స్పీకర్ ప్రసాద్కుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్ లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పోలీసు, ఇంటెలిజెన్స్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన గడ్డం ప్రసాద్ కుమార్... గత సమావేశాలు సజావుగా జరగడానికి సకరించినట్లుగానే ఈ సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande