బీజేఎల్పీ సమావేశం ప్రారంభం.. ప్రధానంగా ఆ రెండు అంశాలపైనే చర్చ..?
హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.) బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఇవాళ బీజేఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పా
బిజెపి సమావేశం


హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.)

బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఇవాళ బీజేఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ముఖ్య నాయకులు హాజరయ్యారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మీటింగు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉప సభాపతి ఎంపిక, సభలో ప్రభుత్వం జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రవేశపెట్టబోతున్న వ్యహరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటరు లిస్ట్ విడుదల చేసిన నేపథ్యంలో బూత్ స్థాయి నుంచి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంపై చర్చించనున్నట్లగా సమాచారం. సమర్ధులైన సర్పంచ్ అభ్యర్థులను రంగంలోకి దింపడం.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై చేయాల్సిన గ్రౌండ్ వర్పై అధ్యక్షుడు రాంచందర్ రావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవరిస్తున్న వారిపై కఠిన చర్యలకు తీసుకునే చాన్స్ ఉంది. అందులో భాగంగానే పెద్దపల్లి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన మొత్తం 12 మంది నాయకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande