శాసనసభ స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కీలక విజ్ఞప్తి
హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.) అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్పాయింట్ ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్ఎస్ఎల్పీకి కల్పించాలని స్పీకర
అసెంబ్లీ స్పీకర్


హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.)

అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్పాయింట్ ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్ఎస్ఎల్పీకి కల్పించాలని స్పీకర్కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్ను కలిసిన వారిలో అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం రమేష్ కుమార్ రెడ్డి ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande