హైదరాబాద్, 29 ఆగస్టు (హి.స.)
తెలుగు టీవీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే రియాలిటీ షో బిగ్ బాస్ మరోసారి సందడి చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ హైపర్ ఎంటర్టైన్మెంట్ షో, ఇప్పుడు సీజన్ 9 రూపంలో ప్రేక్షకులను పలకరించేందుకు రంగంలోకి దిగుతోంది. ఈ మేరకు మేకర్స్ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ 7 నుండి ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రోమోలో నాగార్జున డబుల్ హౌస్ - డబుల్ డోస్ అంటూ చెబుతుండటంతో, ఈ సీజన్ ఫార్మాట్ పై ప్రేక్షకుల్లో కుతూహలం మరింత పెరిగింది.ఈసారి బిగ్ బాస్ హౌస్ ఒకటి కాదు.. రెండు. ఒకవైపు సెలెబ్రిటీలు ఉంటే, మరోవైపు కామనర్స్ కనిపించనున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..