బిహార్‌ జాబితాలో బంగ్లాదేశ్‌, అఫ్గాన్‌ ఓటర్లు..
న్యూఢిల్లీ,29 ,ఆగస్టు (హి.స.) దేశ రాజకీయాల్లో ప్రస్తుతం బిహార్‌ ఎన్నికలు (Bihar Elections) చర్చనీయాంశంగా మారాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తుండగా.. ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయోద్దని ఎన్నికల సంఘం విపక్షాలను హె
vote fraud nadapuram


న్యూఢిల్లీ,29 ,ఆగస్టు (హి.స.) దేశ రాజకీయాల్లో ప్రస్తుతం బిహార్‌ ఎన్నికలు (Bihar Elections) చర్చనీయాంశంగా మారాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్‌ ఆరోపిస్తుండగా.. ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయోద్దని ఎన్నికల సంఘం విపక్షాలను హెచ్చరిస్తోంది. అయితే, ఈసీ చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) సర్వేలో బిహార్‌ ఓటర్ల జాబితాలో అనేకమంది బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, అఫ్గాన్‌ దేశస్థులు ఉన్నట్లు వెల్లడైంది. ఈ దేశాలకు చెందిన అనేకమంది ప్రస్తుతం రాష్ట్రంలో నివాసం ఉంటున్నారని అధికారులు తెలిపారు. వీరంతా ఆధార్‌ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు, రేషన్‌కార్డులు వంటి వాటిని అక్రమ మార్గాల ద్వారా పొందినట్లు తెలుస్తోంది.

ఇలా అవకతవకలకు పాల్పడిన దాదాపు 3 లక్షల మంది ఓటర్లకు ఈసీ నోటీసులు ఇచ్చింది. వీటిపై ఆగస్టు 1 నుంచి పరిశీలన మొదలైందని, ఇది సెప్టెంబరు నెలాఖరు వరకు కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని వెల్లడించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande