.పేదలకు.సొంతింటి కల. నెరవేర్చాలని ప్రభుత్వ లక్ష్యం .హౌసింగ్. శాఖ లో .అవినీతి
ప్రొద్దుటూరు,29 ఆగస్టు (హి.స.) :పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే ప్రభుత్వ లక్ష్యం హౌసింగ్ శాఖలోని అవినీతి అధికారుల )వల్ల నీరుకారుతోంది. హౌసింగ్ శాఖలో రోజుకు ఒక అవినీతి భాగోతం బట్టబయలు అవుతోంది. పేదల ఇంటి నిర్మాణం కోసం ఇచ్చే సిమెంటు, స్టీలును హౌసింగ్
.పేదలకు.సొంతింటి కల. నెరవేర్చాలని ప్రభుత్వ లక్ష్యం .హౌసింగ్. శాఖ లో .అవినీతి


ప్రొద్దుటూరు,29 ఆగస్టు (హి.స.)

:పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే ప్రభుత్వ లక్ష్యం హౌసింగ్ శాఖలోని అవినీతి అధికారుల )వల్ల నీరుకారుతోంది. హౌసింగ్ శాఖలో రోజుకు ఒక అవినీతి భాగోతం బట్టబయలు అవుతోంది. పేదల ఇంటి నిర్మాణం కోసం ఇచ్చే సిమెంటు, స్టీలును హౌసింగ్ శాఖలోని వారే అడ్డంగా బొక్కుతున్నారు. ఏకంగా టన్నుల కొద్ది స్టీలును, లోడ్లకు లోడ్లు సిమెంటును యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌లో విక్రయించి లక్షలకు లక్షలు సొమ్ముచేసుకుంటున్నారు. తాజాగా మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోని హౌసింగ్ గోడౌన్‌లోని స్టీలును అక్రమంగా బ్లాక్ మార్కెట్లకు తరలించిన ఇద్దరు ఏఈలు. ఇద్దరు వర్కు ఇన్‌స్పెక్టర్ల వ్యవహారం వెలుగుచూసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande