అమరావతి, 29 ఆగస్టు (హి.స.)
పెద్దమర్రివీడు (గోనెగండ్ల), మండలంలోని పెద్దమర్రివీడు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన బొగ్గుల రాముడు, బొగ్గుల లక్ష్మన్న, బొగ్గుల ఈరన్నలు మెగా డీఎస్సీ పరీక్షల్లో ప్రతిభ చూపి అత్యధిక మార్కులు సాధించారు. బొగ్గుల జయపాల్ ఎస్జీటీ పరీక్షలో (83.73) సాధించారు. 2024లో జరిగిన సచివాలయం పరీక్షలో ప్రతిభ చూపి వెటర్నరీ అసిస్టెంటుగా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం కులుమాల గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నారు. బొగ్గుల విక్రం డీఎస్సీలో స్కూల్ అసిస్టెంటు బయాలజీలో 81.28 మార్కులు సాధించి జిల్లాలో 13వ ర్యాంకు సాధించారు.అలాగే బొగ్గుల హారతి 2024లో సచివాలయం ఏహెచ్‌ఏ ఉద్యోగం సాధించారు. ప్రసుత్తం చిన్నమర్రివీడులో సచివాలయ ఉద్యోగిగా పని చేస్తున్నారు.మెగా డీఎస్సీ ఎస్జీటీ పరీక్షలో ప్రతిభ చూపి 82.5 మార్కులు సాధించింది. గ్రామం తరఫున ఒకే కుటుంబానికి చెందిన వారు ఉద్యోగాలు సాధించడంతో గ్రామపెద్దలు అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ