మూడు లక్షల ఓటర్లకు ఈసీ నోటీసులు
పట్నా:న్యూఢిల్లీ,29 ,ఆగస్టు (హి.స.) బీహార్ ఓటర్ల జాబితాపై కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) మరో మలుపు తీసుకుంది. తాజాగా భారత ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) బీహార్‌లో ఉంటున్న మూడు లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసింది. వీరు బంగ్లాదేశ్, నే
CEC


పట్నా:న్యూఢిల్లీ,29 ,ఆగస్టు (హి.స.) బీహార్ ఓటర్ల జాబితాపై కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) మరో మలుపు తీసుకుంది. తాజాగా భారత ఎన్నికల కమిషన్‌(ఈసీఐ) బీహార్‌లో ఉంటున్న మూడు లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసింది. వీరు బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినవారిగా అనుమానిస్తూ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్‌ఓ)నోటీసులను పంపారు.

రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఓటరు సవరణల కోసం సమర్పించిన పత్రాలలో వ్యత్యాసాలు కనిపించిన దరిమిలా వారికి ఈసీ నోటీసులు జారీ చేసింది. మొత్తం మూడు లక్షలమంది ఈ తరహా నోటీసులు అందుకున్నారు. వారి పత్రాలలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయో వివరించేందుకు వారికి ఈసీఐ ఏడు రోజులు గడువు ఇచ్చింది. ‘మూడు లక్షల మంది ఎస్‌ఐఆర్‌ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకున్నారు. అయితే వారి పత్రాల పరిశీలనలో వ్యత్యాసాలు కనిపించాయి. దీంతో క్షేత్ర స్థాయిలో తనిఖీలు జరిగాయి. ఫలితంగా వీరు బంగ్లాదేశ్, మయన్మార్ లేదా నేపాల్ నుండి వచ్చి ఉండవచ్చనే అనుమానాలు నెలకొన్నాయని అని ఒక అధికారి మీడియాకు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande