నేడు విశాఖలో.ఎలెక్ట్రిక్.డబుల్. డక్కర్.బస్సులను సీఎం చంద్రబాబు.ప్రారంభించారు
విశాఖపట్నం, 29 ఆగస్టు (హి.స.) : పర్యాటక రంగంలో విశాఖ మరో మైలురాయి దాటింది. సాగర తీర అందాలను అంతెత్తు నుంచి వీక్షించేందుకు అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న నగర వాసుల కల నెరవేరింది. విశాఖలో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను శుక్రవారం ముఖ్య
నేడు విశాఖలో.ఎలెక్ట్రిక్.డబుల్. డక్కర్.బస్సులను సీఎం చంద్రబాబు.ప్రారంభించారు


విశాఖపట్నం, 29 ఆగస్టు (హి.స.)

: పర్యాటక రంగంలో విశాఖ మరో మైలురాయి దాటింది. సాగర తీర అందాలను అంతెత్తు నుంచి వీక్షించేందుకు అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న నగర వాసుల కల నెరవేరింది. విశాఖలో ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులను శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు (chandrababu) ప్రారంభించారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఆర్కే బీచ్‌ నుంచి తొట్లకొండ వరకు మొత్తం 16 కి.మీ మేర పర్యాటక బస్సులు తిరగనున్నాయి.

ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్‌లను మారుస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. విశాఖను రాజధాని చేస్తామని గత పాలకులు అంటే అవసరం లేదని తీర్పిచ్చారని పేర్కొన్నారు. ఆసియా టెక్నాలజీ హబ్‌గా, రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖ మారుతోందన్నారు. విశాఖలో త్వరలో డేటా సెంటర్‌, సీ కేబుల్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కేబుల్‌ ద్వారా విశాఖతో మిగతా ప్రపంచం అనుసంధానం అవుతుందన్నారు. మహిళలకు సురక్షితమైన నగరంగా విశాఖ ఎంపికైందని సీఎం అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande