పిస్తా పప్పును రోజూ తింటే ఏమవుతుందో తెలుసా..?
కర్నూలు, 29 ఆగస్టు (హి.స.)పిస్తా పప్పులు గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే కంటి చూపును మెరుగుపరిచే ల్య
పిస్తా పప్పును రోజూ తింటే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే అవాక్కే..


కర్నూలు, 29 ఆగస్టు (హి.స.)పిస్తా పప్పులు గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే కంటి చూపును మెరుగుపరిచే ల్యూటిన్, జియాజాంతిన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి.

కొన్ని ఆహారాలు పర్యావరణానికి అనుగుణంగా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో పిస్తా ఒకటి. ఇది మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిస్తాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పోషకాలు – వాటి ప్రయోజనాలు

పిస్తాలో మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇందులోని రాగి రోగనిరోధక శక్తికి అవసరమైన యాంటీబాడీల ఉత్పత్తికి సహాయపడుతుంది. విటమిన్ B6 రోగనిరోధక పనితీరును మెరుగుపరచి, శరీరం యాంటీబాడీలను ఉత్పత్తి చేయడంలో తోడ్పడుతుంది. సెలీనియం.. ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి, కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. జింక్.. వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande